24న శ్రీకాకుళంలో దళిత శంఖారావం
ABN , First Publish Date - 2023-11-21T23:56:02+05:30 IST
డాక్టర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజం, సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవల అప్పలస్వామి అన్నారు. మంగళవారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో ఈనెల 24న నిర్వ హించనున్న దళిత శంఖారావం కరపత్రాలను ఆవిష్కరించారు.

టెక్కలి: డాక్టర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజం, సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవల అప్పలస్వామి అన్నారు. మంగళవారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో ఈనెల 24న నిర్వ హించనున్న దళిత శంఖారావం కరపత్రాలను ఆవిష్కరించారు. దళితులకు సంబంధించిన 21 పథకాలను ఎత్తివేసి దళిత వ్యతిరేకిగా జగన్‌రెడ్డి గుర్తింపు పొందారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారని, జగన్ నియంతపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఆస న్నమైందన్నారు. 24న శ్రీకాకుళంలో నిర్వహించనున్న శంఖారావం సదస్సును విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెయ్యి ప్రీతీష్, పేర మురళి, అశోక్ కుమార్, యర్రయ్య, బంగారు ఆదినారాయణ, ఫల్గుణరావు, మల్లేసు, రామారావు, సాయి పాల్గొన్నారు.