కనుమ పండగ నేపథ్యంలో గో పూజలు

ABN , First Publish Date - 2023-01-17T00:09:22+05:30 IST

ఆదిత్యుని ఆలయంలో సోమవారం కనుమ పండగ నేపథ్యంలో గోపూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గోవులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

కనుమ పండగ నేపథ్యంలో   గో పూజలు
శ్రీకాకుళం కల్చరల్‌: నారాయణ తిరుమలలో గోపూజ నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం- ఆంధ్రజ్యోతి: ఆదిత్యుని ఆలయంలో సోమవారం కనుమ పండగ నేపథ్యంలో గోపూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గోవులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు.

నిమ్మాడలో ....

కోటబొమ్మాళి: సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజైన కనుమ సందర్భంగా సోమవారం గ్రామాల్లో ప్రతి ఒక్కరూ గోపూజ నిర్వహించారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు కుటుంబ సభ్యులతో కలిసి గోమాతకు పూజ చేశారు. అలాగే ఊడిగిల పాడు రామమందిరం ప్రాంగణంలో గ్రామస్థులు గోమాతకు పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గొండు లక్ష్మణరావు, శ్రీరామ మందిరం సభ్యుడు సనపల కరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సత్యసాయి గోకులంలో...

పలాస/పలాస రూరల్‌: సత్యసాయి గోకులంలో కనుమ సందర్భంగా గోపూజలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పండగ దినాల్లో గోవులకు పూజిస్తే మంచి చేకూరుతుందని పెద్దలు చెప్పడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గోకులంలో ఉన్న 23 గోవులకు పవిత్ర స్నానాలు చేయించి నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం పూల మాలలు వేసి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టారు. సత్యసాయి ఎడ్యుకే షనల్‌ ట్రస్టు చైర్మన్‌ మల్లా రామేశ్వరరావు, ప్రీతీ చౌదరి, అనుదీప్‌ పాల్గొన్నారు.

రావివలస ఎండల మల్లన్న ఆలయంలో...

టెక్కలి: కనుమ సందర్భంగా రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో గోపూజ సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఈ పూజలు పాల్గొన్నారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి, శ్యామ సుందరస్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోనూ గోపూజ చేపట్టారు.

హైందవ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యం

నరసన్నపేట: హైందవ ధర్మాన్ని పరిరక్షించడమే మన లక్ష్యమని హిందూధర్మ పరిషత్‌ సభ్యుడు నేతింటి సింహాచలం అన్నారు. సోమ వారం కనుమ సందర్భంగా వీరన్నాయుడు కాలనీలో గోపూజ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, సాసు పల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవానిపేట, కోమర్తి గ్రామాల్లో గోపూజ చేసి సహపంక్తి భోజనాలను చేశారు.

పూండి గోవిందపురంలో...

వజ్రపుకొత్తూరు: కనుమ పండగ సందర్భంగా సోమవారం పలు గ్రామాల్లో గోపూజ మహో త్సవాన్ని రైతులు ఘనంగా నిర్వహించారు. పూండి గోవిందపురంలో టీడీపీ నాయకులు పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ గోవులను పూజించి ప్రసా దాలను తినిపించారు.

నారాయణ తిరుమలలో...

శ్రీకాకుళం కల్చరల్‌: కనుమ సందర్భంగా పీఎన్‌ కాలనీలోని నారాయణ తిరుమలలో అర్చకులు జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరి, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టర్‌బంగ్లా వద్ద ఉన్న కల్యాణ వేంకటేశ్వరాలయంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్‌.నందికేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T00:09:23+05:30 IST