‘ఉపాధి’తో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి
ABN , First Publish Date - 2023-07-21T00:00:46+05:30 IST
గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పడుతుందని పథకం రాష్ట్ర డైరెక్టర్ చినతాత య్యలు అన్నారు.
- ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ చినతాతయ్యలు
శ్రీకాకుళం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పడుతుందని పథకం రాష్ట్ర డైరెక్టర్ చినతాత య్యలు అన్నారు. జిల్లా పరిషత్‌లో గురువారం ఉపాధి హామీ పథకంపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రూ.24 కోట్ల పనిదినాలు రాష్ట్ర వ్యాప్తంగా కల్పించేందుకు లక్ష్యం ఉండగా... ఇంతవరకు 18 కోట్ల పనిదినాలు కల్పించామని చెప్పారు. దేశంలో ఇది అరుదైన రికార్డు అని చెప్పారు. ఈ సంవత్సరంలో 45లక్షల కుటుంబాలకు రూ.6వేల కోట్లను వేతనాల కింద అం దించామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.3500 నుంచి రూ.4వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు వివరించారు. మునగపంట అత్యధిక ఆదాయం లభిస్తుందని.. ఈ పంట సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపేలా ప్రచారం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ చిట్టిరాజు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిసెంట్స్, క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.