బెలగాం కార్యదర్శిపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-18T23:47:08+05:30 IST

బెలగాం గ్రామ సచివాలయం వద్ద పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడంతో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెలగాం కార్యదర్శిపై కలెక్టర్‌ ఆగ్రహం

కవిటి: బెలగాం గ్రామ సచివాలయం వద్ద పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడంతో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఇలా ఉంటే వీధుల పరిస్థితి ఏంటని ప్రశ్నించా రు. శనివారం మండలంలోని బెలగాం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా సచివాలయం ముందు పేరుకుపోయిన చెత్త నిల్వలపై పంచాయతీ కార్య దర్శిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోతే శాఖాప రమైన చర్యలు తీసుకుం టామని స్పష్టంచేశారు. అనంతరం సచివాలయ రికార్డులు, సర్వీ సులు తనిఖీచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.అప్పల రాజు, ఎంపీడీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:47:08+05:30 IST