నీలమణి దుర్గ పెద్ద పండగకు విరాళాల సేకరణ
ABN , First Publish Date - 2023-04-08T23:43:17+05:30 IST
ఉత్కళాంద్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గపెద్ద పండగల నిర్వ హణకు శనివారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు.
పాతపట్నం: ఉత్కళాంద్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గపెద్ద పండగల నిర్వ హణకు శనివారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. శాసనపురి మహేశ్వ రరావు, కలివరపు వెంకట రమణ, నల్లి రాజారావు, దొంతం శేఖర్, కలివరపు మధుబాబు ఒక్కొక్కరు రూ.50 వేలు చొప్పు న విరాళం అందించారు. డా.గిడుతూరి వేణుగోపాలరావు రూ.40 వేలు లింగాల మధు బాబు రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.