సీఎం జగన్ దళిత ద్రోహి
ABN , First Publish Date - 2023-11-06T23:22:16+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్ట పురు షోత్తం, రాష్ట్ర కార్యదర్శి బసవల అప్పలస్వామి అన్నారు. రాష్ట్రంలో దళితు లపై జరుగుతున్న దాడు లకు వ్యతిరేకంగా సోమ వారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు
టెక్కలి, నవంబరు 6: ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్ట పురు షోత్తం, రాష్ట్ర కార్యదర్శి బసవల అప్పలస్వామి అన్నారు. రాష్ట్రంలో దళితు లపై జరుగుతున్న దాడు లకు వ్యతిరేకంగా సోమ వారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ వారిపైనే దాడులు చేస్తోందని, రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శించారు. దాడులను నియంత్రిం చాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర కార్య దర్శి రెయ్యి ప్రీతీష్, నాయకులు పేర మురళి, కోళ్ల లవకుమార్, కామేష్, ప్రసాదరెడ్డి, షన్ముఖరావు, అభిలాష్, వాసు, దుర్గారావు, నర్సింహమూర్తి, ఎస్.కిరణ్ పాల్గొన్నారు.