చిరంజీవిరావును గెలిపించండి
ABN , First Publish Date - 2023-03-05T00:00:44+05:30 IST
టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా.వేపాడ చిరం జీవిరావుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శనివారం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థించారు. నిరుద్యో గులకు ఉద్యోగాలు ఇవ్వక పోవడమే కాకుండా నిరుద్యోగ భృతిని తీసివేశారన్నారు. సీపీఎస్ రద్దు హామీగానే మిగిలిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డా.వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని కోరారు.
కొత్తూరు: టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా.వేపాడ చిరం జీవిరావుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శనివారం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థించారు. నిరుద్యో గులకు ఉద్యోగాలు ఇవ్వక పోవడమే కాకుండా నిరుద్యోగ భృతిని తీసివేశారన్నారు. సీపీఎస్ రద్దు హామీగానే మిగిలిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డా.వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని కోరారు. కార్య క్రమంలో కర్లెమ్మ గ్రామ సర్పంచ్ లోతుగెడ్డ భగవాన్‌దాస్ నాయుడు, హిరమండలం జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, టొంపల తిరు పతి, ఎద్దు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి/నందిగాం/హరిపురం/జలుమూరు/పోలాకి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి వైసీపీకి గుణపాఠం చెప్పాలని టీడీపీ మం డల నాయకులు కోరారు. శనివారం టెక్కలి, నందిగాం, మందస, జలు మూరు, సారవకోట, పోలాకి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా.వేపాడ చిరంజీవి రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ పార్టీ మండలాల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, పి.అజయ్ కుమార్, బావన దుర్యోధనరావు, వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొని టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల నేతలు హను మంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, మెండ దమ యంతి, పి.ఉమామహేష్, బి.కిష్టమ్మ, జీకే నాయుడు, లబ్బ రుద్రయ్య, పంచిరెడ్డి రామచంద్రరావు, దుంగ స్వామిబాబు, పొదిలాపు వేణుగోపాలరావు, బైరి భాస్కరరావు, పల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.