22న పాణిగ్రాహి స్మారక సభను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2023-12-11T23:38:28+05:30 IST
విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి 54వ స్మారకసభ ఈనెల 22న నిర్వహిస్తు న్నామని, దీనిని విజయవంతం చేయాలని సోమవారం స్థానిక సూదికొండకాలనీలో అరుణో దయ ప్రజాకళామండలి ఆధ్వ ర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు.
పలాస: విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి 54వ స్మారకసభ ఈనెల 22న నిర్వహిస్తు న్నామని, దీనిని విజయవంతం చేయాలని సోమవారం స్థానిక సూదికొండకాలనీలో అరుణో దయ ప్రజాకళామండలి ఆధ్వ ర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ.. సుబ్బారావు పాణిగ్రాహి విప్లవో ద్యమ చరిత్రలో పెన్ను, గన్నూ ఏకం చేసి ఉద్యమించిన వీరుడిగా, ప్రజాకవిగా ప్రజల హృద యాల్లో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ, పోతనపల్లి కుసుమ, రాపాక మాధవరావు, గోపి, జగన్, మల్లిబాబు, శారద తదితరులు పాల్గొన్నారు.