బావాజీనగర్‌లో కార్డెన్‌సెర్చ్
ABN , First Publish Date - 2023-12-11T00:27:36+05:30 IST
రీకాకుళం నగరం బలగ సమీపంలోని బావాజీనగర్‌లో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు.
- 311 ఇళ్లలో పోలీసుల సోదాలు
- రికార్డులు లేని వాహనాలు స్టేషన్‌కు తరలింపు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 10: శ్రీకాకుళం నగరం బలగ సమీపంలోని బావాజీనగర్‌లో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. రెండవ పట్టణ పోలీసుస్టేషన్ సీఐ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఎన్.లక్ష్మణరావు, కె.లక్ష్మీతోపాటు 35 మంది పోలీసులు.. ఐదు బృందాలుగా ఏర్పడి 311 ఇళ్లల్లో సోదాలు చేశారు. నివాసితుల వివరాలపై ఆరా తీశారు. 214 ద్విచక్ర వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. రికార్డులు లేని ఆరు వాహనాలను టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలో నివశిస్తున్న వారి వివరాలు పరిశీలించామని తెలిపారు. అనుమానితులు, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, జూదర్లు కూడా ఉన్నట్లు గుర్తించామని, వారిపై నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే.. పోలీసుస్టేషన్‌కు లేదా 6309990824, 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐలు శంకరరావు, అరుణకుమారి, హెచ్‌సీలు, పిసిలు, హోంగార్డులు పాల్గొన్నారు.