కాలువలు ఇలా.. ఆరోగ్యం ఎలా?

ABN , First Publish Date - 2023-03-31T00:06:01+05:30 IST

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మురుగు కాలువల నిర్వహణ గాడితప్పింది. దీంతో జనావాసాల్లోకి మురుగు నీరు, రోడ్లపైకి చెత్త చేరుతోంది. దీనికితోడు మురుగునీరు నిల్వ ఉండడంతో పందులు స్వైరవిహారం చేస్తుండడంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు.

కాలువలు ఇలా.. ఆరోగ్యం ఎలా?
బాసుదేవ క్వార్టర్స్‌ వద్ద కాలువలో మురుగు

- పేరుకుపోయిన మురుగు

- రోడ్లపై చెత్తాచెదారం

- పందుల స్వైరవిహారం

- ఆందోళనలో పట్టణవాసులు

- ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో గాడితప్పిన కాలువల నిర్వహణ

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మురుగు కాలువల నిర్వహణ గాడితప్పింది. దీంతో జనావాసాల్లోకి మురుగు నీరు, రోడ్లపైకి చెత్త చేరుతోంది. దీనికితోడు మురుగునీరు నిల్వ ఉండడంతో పందులు స్వైరవిహారం చేస్తుండడంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు.

దశాబ్దాల కిందట నిర్మించిన కాలువలు కావడంతో కొన్ని పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. ప్రస్తుతం మురుగునీటి నిర్వహణకు అనుకూలంగా కాలువలు లేకపోవడంతో నీరు బయటకు వెళ్లడంలేదు. రోజుల తరబడి నిల్వ ఉంటోంది. ఇటీవల కొన్నిచోట్ల లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు సైతం ఇరుగ్గా ఉండడంతో మురుగు కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ వీధుల్లో చెత్త రోడ్లపైకి చేరుతుండడంతో పాదచారులు, వాహనచోదకులు అవస్థలకు గుర వుతున్నారు. కాలువల నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రస్తుతం ము టరుగు నీటి సమస్య ఉత్పన్నమవుతోందని పలు వురు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల కాలువలు పూర్తిగా పాడైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బెల్లుపడ కాలనీ వాసులు చెబుతున్నారు. ప్రధానంగా బాసుదేవ క్వార్టర్స్‌లో నెలల తరబడి కాలువల్లో ము రుగు నీరునిల్వ ఉండడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.

మరమ్మతులు లేక..

పట్టణంలో పలుచోట్ల మురుగు కాలువలకు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో మురుగు, వాడుక నీరు బయటకు వెళ్లక రోడ్లపై కి చేరడంతో దోమలు విజృంభిస్తున్నాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. కొన్నిచోట్ల చే పట్టిన కాలువలు సైతం తూతూ మంత్రంగా నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి కాలువల్లో మురుగు నీరు నిల్వ వల్ల వ్యాధులు ప్రబలుతాయోనని భయాందోళన నెలకొంది.

కాలువల్లో సిల్ట్‌ తొలగిస్తున్నాం

మునిసిపాలిటీ పరిధిలో గల 23వ వార్డుల్లో కాలువల నిర్వహణలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారంలో ఒకరోజు వార్డుల వారీగా కాలువల్లో సిల్ట్‌ తొలగిస్తున్నాం. బెల్లుపడ కాలనీ, బాసుదేవ క్వార్టర్స్‌ వద్ద గల కాలువల్లో మురుగు తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం.

- ఎన్‌.రమేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌, ఇచ్ఛాపురం

నేడు ఇచ్ఛాపురం మునిసిపల్‌ సమావేశం

ఇచ్ఛాపురం: స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంట లకు నిర్వహించను న్నట్లు చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 14 అంశాలపై చర్చ జరగనుందని, అధికారులు, కౌన్సిలర్లు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు. అనంతరం బహిరంగ వేలంపాటలకు సంబందించి అత్యవసర సమావేశం జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2023-03-31T00:06:01+05:30 IST