దగాకోరు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి
ABN , First Publish Date - 2023-03-05T23:13:34+05:30 IST
దగాగోరు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. ఆదివారం లావేరు మండలం బెజ్జిపురం, జి.సిగడాం మండలం డీఆర్‌వలసలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు.
లావేరు/జి.సిగడాం, మార్చి 5: దగాగోరు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. ఆదివారం లావేరు మండలం బెజ్జిపురం, జి.సిగడాం మండలం డీఆర్‌వలసలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ బలపరచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలతోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈయన వెంట లావేరు, జి.సిగడాం మండలాల పార్టీ అధ్యక్షు లు ముప్పిడి సురేష్, కుమరాపు రవికుమార్, మాజీ జడ్పీటీసీ పిన్నింటి మధు బాబు, మాజీ ఎంపీటీసీ దన్నాన శ్రీనివాసరావు, నాయకులు గోపాలకృష్ణరాజు, కాశీబాబు, ముత్యాలు, ఇజ్జాడ అప్పారావు, సన్యాసిరావు, రౌతు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు
చిరంజీవిరావును గెలిపించండి
పొందూరు: వైసీపీ ప్రభుత్వ ఆగడాలను అరికట్టడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిప్రాధాన్యతా ఓటును టీడీపీ బలపరిచిన చిరంజీవిరావుకు వేసి గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ కోరారు. ఆదివారం పొం దూరులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు సీహెచ్ రవికుమార్, జిల్లా తెలుగు యువత ప్రధానకార్యదర్శి బలగ శంకరభాస్కర్, ఎంపీటీసీ బాడాన గిరి, నాయకులు కె.శాంతారాం, డి.రవికుమార్, వరదరాజులు, కాలెపు శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, వాసు, బాల పాల్గొన్నారు.
వైసీపీని ఓడించండి
ఇచ్ఛాపురంరూరల్: ఉపాధ్యాయులు, పట్టుభద్రులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటాలంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, వైసీపీ మద్దతుదారులను చిత్తుగా ఓడించాలని మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు తెలిపారు. ఆదివారం బొడ్డబడ, కొలిగాం గ్రామాల్లో పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ప్రచారంచేశారు. కార్యక్రమంలో సాడి సహదేవురెడ్డి, డి.కామేశ్వరరావు, బి.లోహిదాస్, ఎల్.పద్మనాభం, సాడి ఢిల్లీరావు, కె.నరేంద్ర పాల్గొన్నారు. కవిటి: వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని టీడీపీ నాయకులు సీపాన వెంకటరమణ కోరారు. ఆదివారం డీజీపుట్టుగ, నెలవంక, ముత్యాలపేట, కపాసుకుద్ది గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మణిచంద్ర ప్రకాష్, జయప్రకాష్, బి.లక్ష్మణరావు, విశ్వనాఽథం, బుద్దయ్య, పి.సంతోష్ కుమా ర్, పోల య్య, హరిహరనాఽథ్, పి.సతోష్, పి.రాజు పాల్గొన్నారు.
చిరంజీవి గెలుపునకు కృషి చేయాలి
అరసవల్లి: టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి గెలుపు నకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీమంత్రి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ సిరిపురం త్రినాథ్ కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్ల ఇన్‌చార్జిలు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. నగర పరిధిలోని 8 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఓటర్ల వివరాలు, ఎన్నికల మెటీరియల్‌ను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, నాయకులు చింతు సుధాకర్, జామి భీమశంకరరావు, తదితరులు పాల్గొన్నారు.