ఆ ఇద్దరూ మృతి

ABN , First Publish Date - 2023-04-03T23:44:33+05:30 IST

ఈత సరదా ముగ్గురి ఉ సురుతీసింది. తండ్రీ కొడుకులతో పాటు స్నేహితుడ్ని కబళించింది. ఈ విషాద ఘటన రాజపురంలో జరిగింది.

ఆ ఇద్దరూ మృతి
నాగరాజు, వెంకటరావు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యం

- అర్ధరాత్రి దాటిన తరువాత మృతదేహాల గుర్తింపు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 3: ఈత సరదా ముగ్గురి ఉ సురుతీసింది. తండ్రీ కొడుకులతో పాటు స్నేహితుడ్ని కబళించింది. ఈ విషాద ఘటన రాజపురంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరా లిలా ఉన్నాయి. ఆ దివారం సాయంత్రం వంశధార కాలువలో స్నానానికి దిగి కాలేపు తులసీరావు అనే తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. బాలుడితో పాటు స్నానానికి దిగిన తండ్రి నాగరాజు, ఆయన మిత్రుడు వెంకటరావు ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి దాటిన తరువాత మదుముల వద్ద వీరిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతుడు నాగరాజు నిమ్మాడ గ్రామానికి చెందిన రేవతిని పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు తులసీ రావు, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. పిల్లలిద్దర్నీ తాతగారింటి వద్ద ఉంచుతూ చదివి స్తున్నారు. ఆదివారం పరిశ్రమకు సెలవు రావడంతో దంపతులిద్దరూ శనివారం సా యంత్రం నిమ్మాడ వచ్చారు. వారితో పాటే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటకు చెందిన వెంకటరావు వచ్చాడు. ఆదివారం ఉదయం నాగరాజు, వెంకటరావులతో పాటు తులసీరావు వంశధార కాలువలో స్నానానికి బైక్‌ పై వెళ్లారు. కానీ మధ్యాహ్నం వరకూ వారు ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళనకు గురైన భార్య రేవతి, కుటుంబసభ్యులు గాలించారు. వంశధార కాలువ గట్టుపై బైక్‌, దుస్తులు ఉండడంతో మునిగిపోయి ఉంటారన్న అనుమానంతో గాలించారు. తొలుత తులసీరావు మృతదేహం బయటపడింది. అర్ధరాత్రి దాటిన తరువాత నాగరాజు, వెంకటరావు మృతదేహాలను గుర్తించారు. సోమవారం స్థానిక సీహెచ్‌సీలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. భర్త, కుమా రుడు మృతితో రేవతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-04-03T23:44:33+05:30 IST