శివరాంపురం సమీపంలో పెద్దపులి
ABN , First Publish Date - 2023-11-19T23:45:29+05:30 IST
కొరసవాడ పంచాయతీ శివరాంపురం గ్రామ సమీపంలో పెద్ద పులి సంచ రించినట్లు ఆదివారం అటవీ శాఖాధికారులు గుర్తించారు. శివరాంపురం నుంచి బూర గాం కొండల ప్రాంతానికి వెళ్లి దారిలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఆర్.రాజశేఖర్ తెలిపారు.

పాతపట్నం: కొరసవాడ పంచాయతీ శివరాంపురం గ్రామ సమీపంలో పెద్ద పులి సంచ రించినట్లు ఆదివారం అటవీ శాఖాధికారులు గుర్తించారు. శివరాంపురం నుంచి బూర గాం కొండల ప్రాంతానికి వెళ్లి దారిలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఆర్.రాజశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామానికి అటవీ అధికారులు వెళ్లి ప్రజ లను అప్రమత్తం చేశారు. గ్రామం సమీపంలో పులి సంచరిస్తుండడంతో రైతులు ఆందోళ నకు గురవుతున్నారు. మైదాన ప్రాంతం వరకు ఉన్న కొండ ప్రాంతాల్లోనే పులి తిరుగు తుండడంతో పలు గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎఫ్‌ఎస్‌వో ఈశ్వరరావు, ఎఫ్‌బీవో అజయ్, శివ శివరాంపురంతోపాటు పరిసర గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి పలు సూచనలు చేశారు. పులి తారస పడితే సమాచారం అందించాలని కోరారు. సాయంత్రం, తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లవద్దన్నారు.