‘భోజనం’ కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-09-26T00:07:08+05:30 IST

రాష్ట్రప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మి కులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా మెనూచార్జీలు పెంచాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు.

‘భోజనం’ కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలి

అరసవల్లి, సెప్టెంబరు 25: రాష్ట్రప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మి కులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా మెనూచార్జీలు పెంచాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యమత్రి జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులపై గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్విట్టర్‌లో నిరసన తెలిపారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదాలకు గురైన వారికి పరిహారం చెల్లించాలని, ప్రతీ నెలా 5వ తేదీన జీతాలు ఇవ్వాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వి.లక్ష్మి, టి.రామానుజమ్మ, ఎం.అన్నపూర్ణ, ఆర్‌.రాధ, గీతాబాల, కాంతమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:07:08+05:30 IST