కిడ్నీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-03-18T23:46:00+05:30 IST
కిడ్నీ వ్యాఽధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ తెలిపారు.

కవిటి : కిడ్నీ వ్యాఽధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ తెలిపారు. శనివారం మండలంలోని రాజపురం, బెలగాం పీహెచ్‌సీల వద్ద న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్నీవ్యాధిని అదుపు చేయడానికి ప్రజల సహకా రం అవసరమని చెప్పారు. నొప్పుల మం దులు అధికంగా వినియోగించవద్దని డాక్టర్ల కు సూచించారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో కిడ్నీ వ్యాధికి సంబంధించిన మం దులు, రక్తపరీక్షలు నిర్వహణకు ఏర్పాటుచేశామని, డయా లసిస్ యూనిట్లు సైతం పెంచా మని చెప్పారు. బీసీ, షుగర్ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఎం బి.మీనాక్షి, ఆర్.సన్యాసినాయుడు, ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి పి.రవిశంకర్ పాల్గొన్నారు.