క్రీడాకారులకు ఏకాగ్రత అవసరం

ABN , First Publish Date - 2023-09-26T00:07:58+05:30 IST

క్రీడాకారులు ఏకాగ్రత వహిస్తే మంచి సత్ఫలితాలు సాధించగలరని ఏఎస్పీ టి.విఠలేశ్వరరావు అన్నారు.

క్రీడాకారులకు ఏకాగ్రత అవసరం

- ఏఎస్పీ విఠలేశ్వరరావు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, సెప్టెంబరు 25: క్రీడాకారులు ఏకాగ్రత వహిస్తే మంచి సత్ఫలితాలు సాధించగలరని ఏఎస్పీ టి.విఠలేశ్వరరావు అన్నారు. స్థానిక అరసవల్లి లోని ఆదిత్య అర్చరీ అకాడమీలో జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అర్చరీ ఎంపికలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు విద్యతోపాటు క్రీడలు అవసరమని, వ్యాయమం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారని, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే విద్యార్థులు పోటీల్లో పాల్గొనగలరన్నారు. కాగా అండర్‌-14, 17 బాలబాలికలకు ఇండియన్‌ రౌండ్‌, రికవరీ రౌండ్‌, కాంపౌండ్‌ రౌండ్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకరరావు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, అకాడమీ మైనేజింగ్‌ డైరక్టర్‌ రాజ్‌కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:07:58+05:30 IST