కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-03-27T23:36:57+05:30 IST

గంగివలస కస్తూర్బా బాలికల గురుకుల పాఠ శాలలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని గంగివలస కేజీబీవీ సంక్షేమాధికారి శారదా కుమా రి తెలిపారు.

కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తులు

గంగివలస (పోలాకి): గంగివలస కస్తూర్బా బాలికల గురుకుల పాఠ శాలలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని గంగివలస కేజీబీవీ సంక్షేమాధికారి శారదా కుమా రి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో ప్రవేశానికి బాలికలే అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తు కాపీని సమీప కేజీబీవీ సంక్షేమాధికారులకు అందజేయాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను సోమవారం నుంచి స్వీకరిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు గంగివలస కేజీ బీవీ కార్యాలయం పనిచేయ వేళల్లో సంప్రదించాలని సూచించారు. 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న మిగులు సీట్లను కూడా భర్తీ చేస్తామన్నారు. జూన్‌ లో బాలికలు పాఠశాలలో ప్రవేశించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2023-03-27T23:36:57+05:30 IST