‘నవోదయ’ ఇంటర్‌లో చేరికకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-05-22T23:50:52+05:30 IST

కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందిం చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జవహర్‌ నవోదయలో 2023-2024 విద్యా సంవ త్సరానికి గాను ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో చేరేందుకు గాను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ చివరి తేదీ కాగా జూలై 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

‘నవోదయ’ ఇంటర్‌లో చేరికకు దరఖాస్తులు

ఈనెల 31లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

జూలై 22న ప్రవేశ పరీక్ష

(హిరమండలం)

కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందిం చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జవహర్‌ నవోదయలో 2023-2024 విద్యా సంవ త్సరానికి గాను ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో చేరేందుకు గాను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ చివరి తేదీ కాగా జూలై 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఎవరు అర్హులంటే..

ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి చదివిన వారు అర్హులు. 2021 జూన్‌ ఒకటవ తేదీకి ముందు, 2008 జూలై 31 తరువాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు.

వెన్నెలవలసలో..

1986లో జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం జవహర్‌ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఇక్కడ బాల బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పి స్తారు. జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస నవోదయ విద్యాలయంలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్షా విధానం ఇలా..

ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లీష్‌, సైన్స్‌, సాంఘిక శాస్త్రం, గణితంలో 20 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలుంటుంది.

చదువుతో పాటు..

నవోదయ పాఠశాలలో చదువుతో పాటు భవిష్యత్‌లో మంచి ప్రతిభావంతులుగా తయా రయ్యేలా వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. విద్యార్థి దశ నుంచే ఉత్తమ విలువలు, నైపుణ్యం, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో నైపుణ్యం సాధించేలా బోధన, శిక్షణ ఉంటుంది.

ఐఐటీ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు..

పాఠ్యంశాల బోధనతో పాటు ఐఐటీ, నీట్‌, ఎయిమ్స్‌, ఎన్‌సీఈఆర్టీ వంటి వాటిల్లో ప్రవేశా లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఈ విద్యాలయాల్లోని గ్రంథాలయాల్లో తెలుగు, ఇంగ్లీష్‌, హిం దీ, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షల పుస్తకాలు చదువుకోవచ్చు. విశాల మైన ఆట స్థలం ఉంది. ఉదయం, సాయం సమయాల్లో క్రీడల్లో శిక్షణ ఇస్తారు. ఇక్కడ విద్యా ర్థులు ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. విద్యతో పాటు క్రీడలు, యోగా, చిత్రలేఖనం, సంగీతం, సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కలిగిస్తారు. కంప్యూటర్‌ సదుపాయం ఉంది. అత్యున్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యా యులు ఉన్నారు.

పారదర్శకంగా ప్రవేశాలు

నవోదయ విద్యాలయంలో చేరేందుకు పారదర్శకంగా ప్రవేశాలుంటాయి. దళారులను నమ్మొద్దు. ఇక్కడ చేరిన విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేయడంతో పాటు వారికి అవ సరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సాంస్కృతిక కార్య క్రమాలు, క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఉన్నత ఉద్యో గాలు సాధించారు. కష్టపడి చదివితే విద్యాలయంలో సీటు సాధించవచ్చు.

-డి.పరశురామయ్య, ప్రిన్సిపాల్‌, జవహర్‌ నవోదయ విద్యాలయం, వెన్నెలవలస

Updated Date - 2023-05-22T23:50:52+05:30 IST