రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
ABN , First Publish Date - 2023-09-22T00:08:42+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు.
- జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ దీక్షలు
అరసవల్లి, సెప్టెంబరు 21: రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. గురువారం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మత్స్యకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రోజు నిరాహార దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. టీడీపీ హయాంలో మత్స్యకా రులకు బోట్లు, వలలు సబ్సిడీపై అందించామని, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు మైలపల్లి నర్సింగరావు, రాంబాబు, రాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు కలగ జగదీష్, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీ రమణ మాదిగ, ఐటీడీపీ అధ్యక్షుడు విజయరాం తదితరులు పాల్గొన్నారు.
- గార: టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీకూర్మంలో ‘బాబుతో నేను‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతీ షాప్ వద్దకు వెళ్లి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ హరగోపాల్, పొట్నూరు కృష్ణమూర్తి, అంధవరపు హరి, అంధవరపు గోపాల్, కైబాడి రాజు, గోర సురేష్, ఎల్.రాధాకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ఇచ్ఛాపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన దీక్ష గురువారం కొనసాగింది. పాతబస్టాండ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఇచ్ఛాపు రం మండల నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. దీక్షలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సాడి సహదేవ్‌రెడ్డి, నాయకులు ఎల్.పద్మనాభం, డి.కామేష్, పి.దుర్యోధన, హేమారాజు, ప్రసాద్, దున్న లోకేష్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్రబీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్, జిల్లా కార్యదర్శి ఆశి లీలారాణి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందికి జాని తదితరులు సంఘీభావం తెలిపారు.
- ఎచ్చెర్ల: ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. ఎచ్చెర్లలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఆవరణలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న దీక్ష గురువారం తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 45 కేంద్రా ల్లో స్కిల్‌డెవలప్‌మెంట్ కేంద్రాలను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి, యువతకు ఉపాధి కల్పించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల, రణస్థలం మండలాల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, లంక శ్యామ్, పార్టీ నేతలు గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనేశ్వ రరావు, పైడి ముఖలింగం, గూరు జగపతిబాబు, బచ్చు కోటిరెడ్డి, బోర శ్రీనివాసరావు, గట్టెం శివ రామ్, పొన్నాడ అప్పలనాయుడు, మెండ రాజా రావు, అలుపన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- నరసన్నపేట: రైతులు సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. గురువారం నర సన్నపేటలో తొమ్మిదో రోజు చేపట్టిన దీక్షలో రైతు విభాగం నాయకులు పా ల్గొన్నారు. రాష్ట్ర తెలుగురైతు విభాగం కార్యదర్శి జల్లు చంద్రమౌళి, నాయకులు సూరపు నారాయణదాసు, గొండు రామన్న, సాధు చిన్నకృష్ణంనాయడు, కత్తిరి వెంకటరమణ, లుకలాపు రాంబాబు,శిమ్మ జగన్నాథం, పీస కృష్ణ పాల్గొన్నారు.
- పోలాకి: అరెస్టులకు భయపడేదిలేదని టీడీపీ మండలాధ్యక్షుడు మిరియబిల్లి వెంకట అప్పలనాయుడు తెలిపారు. నరసన్నపేటలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. పోలాకిలో ఆయన గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందన్నారు.
- ఎల్‌ఎన్ పేట: కోవిలాం కాలనీకి ఆనుకొని ఉన్న అలికాం-బత్తిలి ప్రధానరోడ్డుపై గురువారం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఎన్. నారాయణరావు, గణపతిరావు, ఎం. అప్పారావు, ఎస్. రామారావు పాల్గొన్నారు.
- కోటబొమ్మాళి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు తోడుగా మేమున్నామని, ఆయన విడుదలయ్యే వరకూ పోరాటాలు ఆగవని కోటబొమ్మాళి, టెక్కలి మండలాల పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్, బగాది శేషగిరి తెలిపారు. గురువారం కోటబొమ్మాళి టీడీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ నాయకులు స్థానిక టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. అనంతరం టీడీపీ శ్రేణులు మండల పరిషత్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, దేవాది సింహాద్రి, బండి అన్నపూర్ణ పాల్గొన్నారు.
- కాశీబుగ్గ: సీఎం జగన్‌రెడ్డి చెమటలు పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ మంత్రి శివాజీ తెలిపారు. గురువారం కాశీబుగ్గలో దీక్ష శిబిరంలో తొమ్మిదో రోజు గౌతు శిరీష ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గంలోని గిరిజనులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గెలిపిస్తారని భయంతో అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టించారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు,మాజీ కౌన్సిలర్ సవర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- పాతపట్నం: చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గురువారం నిర్వహించిన రిలే దీక్షలో ఎల్‌ఎన్‌పేట మండల టీడీపీ రైతు విభాగం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ మాట్లాడుతూ.. దీక్షా శిబిరంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరసనదారుల సంఖ్య చంద్రబాబుపై ప్రజలకు గల ఆదరాభిమానాలకు దర్పం పడుతోందన్నారు.
చంద్రబాబు కోసం పోస్టుకార్డు ఉద్యమం
పాతపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆరు వేల పోస్టు కార్డులు పంపిస్తున్నట్టు ఆ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ తప్పును గ్రహించి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులకు తావులేదని, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు వస్తున్న మద్దతు.. ఆయన నిజాయితీని చాటుతుందన్నారు. పార్టీ నాయకులు పైల బాబ్జీ, యాళ్ల నాగేశ్వరరావు, వెలమల గోవిందరావు, ఎద్దు దాస్‌నాయుడు, నంబాళ్ల వెంకటరావు, కోలాపు కృష్ణమాచార్య, ఆరుబోలు దశరధరావు తదితరులు పాల్గొన్నారు.