డివైడర్‌ను బైక్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
ABN , First Publish Date - 2023-03-05T23:06:44+05:30 IST
మండలంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన కోటేశ్వరరావు (64) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు.
రణస్థలం, మార్చి 5: మండలంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన కోటేశ్వరరావు (64) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈయన విశాఖప ట్నం నుంచి శ్రీకాకుళానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా పైడిపేట వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కోటేశ్వరరావుకు భార్య రామలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్‌పుం ఎస్‌ఐ జి.రాజేష్ తెలిపారు.