అంబరాన్నంటిన సిరిమాను సంబరం

ABN , First Publish Date - 2023-05-09T23:39:31+05:30 IST

మండల కేంద్రమైన జలుమూరులో ఆదిలక్ష్మి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్నంటింది. సిరిమానుకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుకోటి మంగయ్యనాయుడు, దేవిప్రసాద్‌ కుటుంబీకులు సిరిమానును అధిష్టించి గ్రామోత్సవం ప్రారంభించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న అమ్మవారి స్థలం నుంచి సిరిమాను ప్రారంభమై వివిధ వీధుల గుండా పయనించి ప్రధాన మార్గంలోకి చేరింది. సిరిమాను ఇంటి సమీపంలోకి వచ్చినప్పుడు ముర్రాటలు సమర్పించి భక్తులు మొ క్కులు తీర్చుకున్నారు.

అంబరాన్నంటిన సిరిమాను సంబరం
జలుమూరు: సిరిమానోత్సవంలో పాల్గొన్న ప్రజానీకం

జలుమూరు, మే 9: మండల కేంద్రమైన జలుమూరులో ఆదిలక్ష్మి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్నంటింది. సిరిమానుకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుకోటి మంగయ్యనాయుడు, దేవిప్రసాద్‌ కుటుంబీకులు సిరిమానును అధిష్టించి గ్రామోత్సవం ప్రారంభించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న అమ్మవారి స్థలం నుంచి సిరిమాను ప్రారంభమై వివిధ వీధుల గుండా పయనించి ప్రధాన మార్గంలోకి చేరింది. సిరిమాను ఇంటి సమీపంలోకి వచ్చినప్పుడు ముర్రాటలు సమర్పించి భక్తులు మొ క్కులు తీర్చుకున్నారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలిరావడంతో జలుమూరు జన సంద్రమైంది. కాళీమాత వేషధారణలు, డప్పులు వాయిద్యాలు, పాములు విన్యాసాలు, బుట్టబొమ్మలు డాన్సు, ధూమ్‌ ధడాకా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిరిమానోత్సవం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉత్సవం సజావుగా సాగేలా కమిటీ సభ్యులు, గ్రామ యువత చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నరసన్నపేట సీఐ బి.రాము నేతృత్వంలో ఎస్‌ఐ పి.పారినాయుడు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సిరిమానోత్సవంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వెలమల రాజేంద్రనాయుడు, ధర్మాన తేజ కుమార్‌, మునుకోటి దామోదరరావు, కత్తిరి వెంకటరమణ, పంచిరెడ్డి రామచంద్రరావు, దుంగ స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అనుపోత్సవం

హిరమండలం: పాత హిరమండలం గ్రామ దేవత నీలమణి తల్లి ఘటాల అనుపోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాయు డు వంశీయులు జోగినాయుడు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో మహిళలు ఘటాలతో ఊరే గింపుగా వెళ్లి ముర్రాటలు సమర్పించారు. ఉత్సవాల ముగింపు కావడం తో అర్ధరాత్రి వరకు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. 12 ఏళ్ల తరువాత గ్రామదేవత పెద్ద పండగ కావడంతో పెద్ద సంఖ్యలో బంధువుల రాకతో గ్రామం కళకళలాడింది.

నేడు వాహనాల దారి మళ్లింపు

పాత హిరమండలంలో గ్రామ దేవత పెద్ద పండగల సందర్భంగా బుధవారం గ్రామస్థులు విందు భోజనాలు ఏర్పాటు చేయడంతో బంధుజనం భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇతర వాహనాల రాకపోకలను నిషేధించారు. పాత హిరమండలం పెట్రోల్‌ బంకు వెనుక నుంచి ఉన్న రిజర్వాయర్‌ గట్టు పక్క నుంచి పెద్ద కోరాడ వద్దకు చేరుతున్న రహ దారి మీదుగా వాహనాల రాకపోకలు సాగించాలని ఎస్‌ఐ జి.రామస్వామి సూచించారు.

Updated Date - 2023-05-09T23:39:31+05:30 IST