అకుంఠిత దీక్ష..
ABN , First Publish Date - 2023-09-26T00:03:09+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టు, జైలును ఖండిస్తూ పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కోసం రెండు వారాలుగా అకుంఠిత దీక్షలు చేపడుతున్నారు.

- చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
( శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టు, జైలును ఖండిస్తూ పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కోసం రెండు వారాలుగా అకుంఠిత దీక్షలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం నాయకులు, కార్యకర్తలు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆమదాలవలసలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పలాసలో మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, పాతపట్నంలో మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎచ్చెర్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. సైకో సీఎంకు బుద్ధిరావాలంటూ నినాదాలు చేశారు.