పెళ్లయిన రెండు నెలలకే ...

ABN , First Publish Date - 2023-05-31T23:41:03+05:30 IST

మండల పరిధి కొల్లవానిపేట-జల్లువానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో కామేశ్వరిపేట గ్రామసచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ మట్ట సోమేశ్వరరావు (30) అక్కడక్కడే మృతిచెందారు.

 పెళ్లయిన రెండు నెలలకే ...

నరసన్నపేట: మండల పరిధి కొల్లవానిపేట-జల్లువానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో కామేశ్వరిపేట గ్రామసచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ మట్ట సోమేశ్వరరావు (30) అక్కడక్కడే మృతిచెందారు. రైల్వే పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని బలగలో ఉంటున్న మట్ట సోమేశ్వరరావు ఎప్పటి లాగే విధులు నిర్వహించేందుకు ద్విచక్ర వాహనంపై కామేశ్వరపేటలో బయలుదేరి కొల్లవానిపేట గేటు వద్దకు వచ్చాడు. ఆ సమయంలో రైల్వే గేటు పడింది. ఆమదాలవలస నుంచి తిలారు వైపు వెళ్లే లైన్‌లో గూడ్స్‌ వెళ్లిన వెంటనే రైల్వేగేటు ఎత్తివేయడంతో అతడు గేటు దాటుతుండగా తిలారు నుంచి ఆమదాల వలస వైపు వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు, తెలగవలస గ్రామా నికి చెందిన వేలాల రమేష్‌, ఉర్లాం గ్రామానికి చెందిన పుల్లటి వెంకటరమణ తెలి పారు. ద్విచక్ర వాహనాన్ని రైలు అర కిలోమీటరు దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సోమేశ్వరరావు కుడికాలు తెగిపోగా మృతదేహం పట్టాలు పక్కన పడిపోయింది.

తల్లిదండ్రుల రోదన

సోమేశ్వరరావుకు రెండు నెలల కిందటే విజయనగరానికి చెందిన జయశ్రీతో వివాహమైంది. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం సోమేశ్వరరావు మృతితో లబోదిబోమంటున్నారు. మృతదేహాన్ని చూసి తండ్రి శ్యామలరావు, తల్లి సరస్వతి, భార్య జయశ్రీ, చెల్లి గౌతమి బోరున విలపించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేవాడని, రైలు రూపంలో మృత్యువాతకు గురవడంతో సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కన్నీరుపెట్టుకున్నారు. ఆమదాలవలస రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఏమిటీ విధి వంచన

రోజూలాగే విధులకు వెళుతున్న సోమేశ్వరరావు రైల్వేగేటు దాటే సమయంలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు రెప్పపాటులో దొరికిపోయాడు. ఆ సమయంలో కొల్లవా నిపేట నుంచి ఒక ఆటో, కారు కూడా వచ్చిందని, అయితే డౌన్‌లైన్‌ నుంచి రైలు వెళ్లడంతో సోమేశ్వరరావు ఈ ప్రమాదానికి గురైనట్లు స్థాని కులు చెబుతున్నారు. రైలు రాకపోకలపై ఆమదాలవలస-ఉర్లాం స్టేషన్ల నుంచి సమాచారం మేరకే గేటుమెన్‌ గేట్‌ వేయడం, తీయడం జరుగుతుంది. అయితే యశ్వంత్‌పూర్‌ వచ్చిన సమయంలో గేటు తీయడంతోనే ఈ ప్రమాదం జరిగిందిన ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, గేటు కింద నుంచి వెళ్లాడని గేట్‌మెన్‌ శర్మ చెబుతున్నారు. ఈ విషయమై శాఖాపరంగా దర్యాప్తు నిర్వహించనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి ..

టెక్కలి: స్థానిక జడ్పీ రోడ్డులో బాగారుల ఆస్తి తగాదాలకు సంబంధించి ఈనెల 26న ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న బమ్మిడి లక్ష్మణరావు(48) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. తీవ్రంగా కాలిన గాయాలతో లక్ష్మణరావు టెక్కలి జిల్లా కేంద్ర ఆసు పత్రిలో చికిత్సకు చేరగా వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తర లించారు. ఆరు రోజుల పాటు చికిత్స పొంది మృతిచెందాడు. ఇప్పటికే టెక్కలి మెజిస్ట్రేట్‌ ఆయన వద్ద నుంచి మరణ వాంగ్మూలం నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు..

వజ్రపుకొత్తూరు:బాతుపురం గ్రామానికి చెందిన ఈరోతు హేమంత్‌ అలియాస్‌ నాగ (22) శివసాగ ర్‌ బీచ్‌ జంక్షన్‌లోని జీడితోటలో పంచెతో ఉరివేసుకొని మృతి చెందాడు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం ఉండడంతో బుధవారం గ్రామస్థులు, మృతు డి కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి మృతుడు హేమంత్‌గా గుర్తించారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..హేమంత్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం శివసాగర్‌ బీచ్‌ జంక్షన్‌లో ఉన్న ఓ డాబాలో ఫాస్ట్‌ఫుడ్‌ తిన్న తరువాత రూ.500 నోటు విషయమై డాబా యజమానికి, హేమంత్‌కు మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో డాబా యజమాని అతడిని కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటల తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లివస్తానని చెప్పిన హేమంత్‌ తిరిగి రాకపోవడమే కాకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో తండ్రి వీరాస్వామి, తమ్ముడు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేసి గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం హేమంత్‌ ఉరి వేసుకొని మృతి చెంది ఉండడాన్ని గమనించారు. హేమంత్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కుమారుడి మృతిపై అను మానాలున్నాయని తండ్రి చెబుతున్నారు. శివసాగర్‌ జంక్షన్‌లో ప్రభుత్వం వైన్‌షాపు పెట్టిన తరువాత డాబాలు ఏర్పడడంతో సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలా పాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. మద్యం సేవించిన యువకుల వద్ద నుంచి కొంతమంది సెల్‌ఫోన్‌లు దొంగలించడం, ప్రశ్నించిన వారి పై దాడులు చేయడం నిత్యకృత్యమైందని, ఈ నేపథ్యంలో హేమంత్‌ అనుమానా స్పద మృతికి మరింత బలం చేకూరు తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూధన్‌. ఏఎస్‌ఐ జున్నా రావు క్లూస్‌ టీంతో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. శవపంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.

Updated Date - 2023-05-31T23:41:03+05:30 IST