జాతీయ నేతలకు ఆదివాసీల వినతి

ABN , First Publish Date - 2023-05-26T23:40:49+05:30 IST

బోయ, వాల్మీకిలను ఎస్టీలో జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో వివిధ పార్టీల జాతీయ నాయ కులను కలిసి వినతిపత్రాలు అందించారు.

జాతీయ నేతలకు ఆదివాసీల వినతి
ఆలిండియా కాంగ్రెస్‌ ఆదివాసీ అధ్యక్షుడు శివాజీ యోగేకి వినతి పత్రం అందజేస్తున్న గిరిజన సంఘాల నేతలు

మెళియాపుట్టి, మే 26: బోయ, వాల్మీకిలను ఎస్టీలో జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో వివిధ పార్టీల జాతీయ నాయ కులను కలిసి వినతిపత్రాలు అందించారు. ఆలిండియా కాంగ్రెస్‌ ఆదివాసీ నేషనల్‌ అధ్యక్షుడు శివాజీ యోగే, సీపీఎం, సీపీఐ, ఓబీసీ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, డి. రాజా, కె.లక్ష్మణ్‌లను కలిసి సమస్యను వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా బోయ, వాల్మీకి లను ఎస్టీలో జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, దీనిని పార్లమెంటులో వ్యతిరేకించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు చేస్తోందన్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి వినతి పత్రాలు అందిస్తామని యోగి పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు జె.పరశురాం, డి.మోహనరావు, టి.తవిటి నాయుడు, జె.నాగేశ్వరావు, దండాసి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:40:49+05:30 IST