మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
ABN , First Publish Date - 2023-06-26T23:19:02+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుం టామని ఎంఈవో-2 కె.చంద్రమౌళి స్పష్టం చేశారు. కొమ్ము వలస జడ్పీ ఉన్నత పాఠ శాలను సోమవారం సంద ర్శించారు.
కొమ్మువలస(ఎల్.ఎన్.పేట): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుం టామని ఎంఈవో-2 కె.చంద్రమౌళి స్పష్టం చేశారు. కొమ్ము వలస జడ్పీ ఉన్నత పాఠ శాలను సోమవారం సంద ర్శించారు. ఈ సందర్భంగా భోజన పదా ర్థాలను రుచి చూసి పరిశీలించారు. విద్యార్థులు ఆరో గ్యంగా ఉండేందుకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాల న్నారు. విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. హెచ్‌ఎం లలిత కుమారి, విద్యాకమిటీ చైర్మన్ సంజీవరావు, సర్పంచ్ ఆర్.సీతారాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.