అచ్యుతాపురం తాగునీటి ప్రాజెక్టు పైప్‌లైన్‌ లీక్‌

ABN , First Publish Date - 2023-05-02T23:54:48+05:30 IST

అచ్యుతాపురం వద్ద వంశధార నది సమీపంలో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు ప్రధాన పైప్‌లైన్‌ దెబ్బతినడంతో 44 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. పాగోడు కూడలి వద్ద మంగళవా రం మెయిన్‌ పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో తాగునీరు వృథాగా పోతోంది. జలుమూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలకు తాగునీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అచ్యుతాపురం తాగునీటి ప్రాజెక్టు పైప్‌లైన్‌ లీక్‌
పైప్‌లైన్‌ దెబ్బతిని వృథాగా పోతున్న తాగునీరు

44 గ్రామాల్లో తాగునీటికి ఇక్కట్లు

జలుమూరు: అచ్యుతాపురం వద్ద వంశధార నది సమీపంలో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు ప్రధాన పైప్‌లైన్‌ దెబ్బతినడంతో 44 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. పాగోడు కూడలి వద్ద మంగళవా రం మెయిన్‌ పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో తాగునీరు వృథాగా పోతోంది. జలుమూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలకు తాగునీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్‌ కు మరమ్మతులు చేయించి నీటి ఎద్దడి లేకుడా చర్య లు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతు న్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చైతన్య వివరణ కోరగా పైప్‌లైన్‌ దెబ్బతిని తాగునీరు వృథాగా పోతోందన్న సమాచారం వచ్చిందని, యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2023-05-02T23:54:48+05:30 IST