Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:30 AM

టెక్కలి-నౌపడ రోడ్డులోని చిన్ననారా యణపురం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

టెక్కలి రూరల్‌: టెక్కలి-నౌపడ రోడ్డులోని చిన్ననారా యణపురం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన లోపింటి శేషురెడ్డి(27) ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మూలపేట పోర్టు లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. ఈ ఘటనపై పరిశీలించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ-2 కె.రమేష్‌బాబు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా నౌపడలోని తన సోదరి వద్ద ఉంటున్నాడు. గ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - Dec 23 , 2023 | 12:30 AM