Share News

రైలు ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-11-22T00:03:37+05:30 IST

మండలంలోని భవానీపురానికి చెందిన తిప్పన మీనరాజ్‌(20) రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ కె.గోవిందరావు కథనం మేరకు.. భవానీ పురానికి చెందిన మీనరాజ్‌ చెడు వ్యసనాలకు బానిపై తరచూ ఇంటి వద్ద తల్లి, చెల్లెలితో గొడవపడేవాడు. సోమవారం రాత్రి ద్విచక్రవాహనం కొనుగోలుకు డబ్బులు కావాలని తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వనని ఆమె చెప్పడంతో మీనరాజ్‌ సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి చిందబరే శ్వరాలయం పక్కన గల రైల్వే ట్రాక్‌పై నిల్చొని ఉండగా గుర్తుతెలియని రైలు ఢీకొ ట్టడంతో తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రైలు అతివేగంగా ఢీకొట్టడంతో ఆలయ ముఖద్వారం వద్ద పడి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని యువకుడి మృతి

ఇచ్ఛాపురం: మండలంలోని భవానీపురానికి చెందిన తిప్పన మీనరాజ్‌(20) రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ కె.గోవిందరావు కథనం మేరకు.. భవానీ పురానికి చెందిన మీనరాజ్‌ చెడు వ్యసనాలకు బానిపై తరచూ ఇంటి వద్ద తల్లి, చెల్లెలితో గొడవపడేవాడు. సోమవారం రాత్రి ద్విచక్రవాహనం కొనుగోలుకు డబ్బులు కావాలని తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వనని ఆమె చెప్పడంతో మీనరాజ్‌ సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి చిందబరే శ్వరాలయం పక్కన గల రైల్వే ట్రాక్‌పై నిల్చొని ఉండగా గుర్తుతెలియని రైలు ఢీకొ ట్టడంతో తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రైలు అతివేగంగా ఢీకొట్టడంతో ఆలయ ముఖద్వారం వద్ద పడి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్సపొందుతూ ఒకరు..

లావేరు:మండలంలోని తాళ్లవలసకు చెందిన కూనపల్లి గౌరీశంకర్‌ (27) చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాళ్లవలసకు చెందిన గౌరీశంకర్‌కు ఈనెల 17న కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నానానికి పాల్పడాడు. కుటుంబ సభ్యులు 108 వాహ నంలో చికిత్సకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. గౌరీశంకర్‌కు భార్య శారదతో పాటు యశ్వంత్‌ కుమా ర్‌, అశ్విని ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌరీశంకర్‌ భార్య ఫిర్యాదుమేరకు లావేరు ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదుచేశారు.

Updated Date - 2023-11-22T00:03:38+05:30 IST