Share News

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:32 PM

మండలంలోని గోపాలపెంటకు చెందిన పాలుమూరు సావిత్రమ్మ (61) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... గోపాలపెంట గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఈనెల 11న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌చేశారు. ఈ మేరకు అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. వీఆర్వో బలగ రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

నరసన్నపేట : మండలంలోని గోపాలపెంటకు చెందిన పాలుమూరు సావిత్రమ్మ (61) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... గోపాలపెంట గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఈనెల 11న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌చేశారు. ఈ మేరకు అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. వీఆర్వో బలగ రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Updated Date - Dec 14 , 2023 | 11:32 PM