ఉద్దానంలో పులి కలకలం
ABN , First Publish Date - 2023-10-30T01:41:56+05:30 IST
ఉద్దానం ప్రాంతం కొబ్బరి తోటల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో కలకలం నెలకొంది. ఆదివారం ఉదయం అటవీశాఖ కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ, సెక్షన్ అధికారులు రాఘవయ్య, రాజు, రెడ్డి కవిటి మండలం జగతి, బెజ్జిపుట్టుగ, బొరివంక ప్రాంతాల తోటలతో పాటు కవిటి వద్ద ఉన్న తీర ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించారు.
- కొబ్బరితోటలు, బీచ్‌లో అడుగు జాడల గుర్తింపు
కవిటి, అక్టోబరు 29: ఉద్దానం ప్రాంతం కొబ్బరి తోటల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో కలకలం నెలకొంది. ఆదివారం ఉదయం అటవీశాఖ కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ, సెక్షన్ అధికారులు రాఘవయ్య, రాజు, రెడ్డి కవిటి మండలం జగతి, బెజ్జిపుట్టుగ, బొరివంక ప్రాంతాల తోటలతో పాటు కవిటి వద్ద ఉన్న తీర ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించారు. పుక్కళ్లపాలెం సమీపంలోని బీచ్ వద్ద ఉన్న మొదటి డొంకల వరకు అడుగుజాడలు కనిపించడంతో ఆ ప్రాంతంలో పులి ఉంటుందని కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ, అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తీరప్రాంతంతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు ఎవరూ రావద్దని తెలిపారు.