Share News

పోలెండ్‌లో ధర్మపురం వాసి మృతి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:54 PM

ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన వలస కూలి ఉప్పాడ సోమేష్‌ రెడ్డి(34) పోలేండ్‌ దేశంలో అనారోగ్యంతో మృతి చెందాడు.

పోలెండ్‌లో ధర్మపురం వాసి మృతి

ఇచ్ఛాపురం రూరల్‌, డిసెంబరు 17 : ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన వలస కూలి ఉప్పాడ సోమేష్‌ రెడ్డి(34) పోలేండ్‌ దేశంలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం సోమేష్‌ రెండు నెలలు కిందట పోలెండ్‌ వెళ్లి ఒక కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతు శనివారం రాత్రి మృతి చెందినట్లు కంపెనీ నుంచి సమాచారం అందిందని సోమేష్‌రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సోమేష్‌రెడ్డికి భార్య పుష్ప, ఆరు నెలల పాప ఉంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు.. నేతల సాయంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:54 PM