వలలో చిక్కిన అరుదైన విష సర్పం

ABN , First Publish Date - 2023-01-02T23:31:35+05:30 IST

అరుదైన విషసర్పం మత్స్యకారుల వలలో చిక్కుకోగా దానిని సురక్షితంగా కాపాడి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన సంఘటన సోమవారం పట్టణంలోని అంబుసోలి గ్రామంలో సంభవించింది.. వివరాలిలా ఉన్నాయి.. గ్రామం లోని దొయిసాగరం చెరువులో చేపలు బయటకు వెళ్లి పోకుండా ఉండేలా వలను ఏర్పాటు చేశారు. ఈ వలకు గౌరీబెత్తు (బాండెడ్‌ క్రయిట్‌) అనే విషసర్పం చిక్కింది. ఉదయం 10 గంటల సమ యంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికుడు సంజీవికి వలలో చిక్కు కున్న విషసర్పం కనిపించింది.

వలలో చిక్కిన అరుదైన విష సర్పం
వలలో చిక్కుకున్న గౌరీబెత్తు పామును పరిశీలిస్తున్న రెస్క్యూ టీమ్‌

పలాస, జనవరి 2: అరుదైన విషసర్పం మత్స్యకారుల వలలో చిక్కుకోగా దానిని సురక్షితంగా కాపాడి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన సంఘటన సోమవారం పట్టణంలోని అంబుసోలి గ్రామంలో సంభవించింది.. వివరాలిలా ఉన్నాయి.. గ్రామం లోని దొయిసాగరం చెరువులో చేపలు బయటకు వెళ్లి పోకుండా ఉండేలా వలను ఏర్పాటు చేశారు. ఈ వలకు గౌరీబెత్తు (బాండెడ్‌ క్రయిట్‌) అనే విషసర్పం చిక్కింది. ఉదయం 10 గంటల సమ యంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికుడు సంజీవికి వలలో చిక్కు కున్న విషసర్పం కనిపించింది. అరుదైన జీవిగా గుర్తించి గ్రామ స్థులకు తెలుపగా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అం దించారు. వారు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించి వైల్డ్‌లైఫ్‌ సొసైటీ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు చెప్పడంతో ఆయన వచ్చి పరిశీలించి ఎలా చిక్కుకున్నదీ, దానిని బయటకు ఎలా తీయాలనే విషయాలపై అధికారులతో చర్చించారు. వలను కట్‌ చేసి పాము బయటకు తీశారు. అప్పటికే దాని శరీరంపై అనేక భాగాలు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. దీనికి సపర్యలు చేసి సమీపంలోని మెండు జీడి ఫారెస్ట్‌ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అంతరించే జాతుల్లో ‘గౌరీబెత్తు’ ఒకటి

ఈ సందర్భంగా అటవీఅధికారి కృష్ణారావు విలేకర్లతో మాట్లాడు తూ.. గౌరీబెత్తుగా పిలువబడే పాములు జిల్లాలో అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇవి అరుదుగా కనిపిస్తాయని, పొలా ల్లో ఎలుకలను తింటూ జీవిస్తాయన్నారు. రాత్రులు మాత్ర మే సంచరించే ఈ జీవరాశి అంతరించే ప్రాణుల్లో ఒకటిగా ఉందన్నా రు. ఇది కరిచిన వెంటనే 24 గంటల్లో మనిషి ప్రాణాలు పోతా యని, ఇటువంటి సర్పాలు తారసపడితే సమా చారం అందించే వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెస్క్యూలో అటవీ సిబ్బంది లక్ష్మీనారాయణ, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-02T23:31:36+05:30 IST