గోకర్ణపల్లిలో మొక్కజొన్నకు తెగులు

ABN , First Publish Date - 2023-09-20T00:19:33+05:30 IST

మండలంలోని గోకర్ణపల్లిలో మొక్క జొన్న పంటకు తెగులు ఆశించడం తో 150 ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. ఇక్కడ సుమారు 60 మంది రైతులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుచేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటచేతికొచ్చిన సమయం లో తెగులుఆశించి ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవ సాయాధికారులు పంటను పరిశీలించి పరిహారం అందించాలని మాజీ సర్పంచ్‌ చింతాడ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కాగా గోకర్ణపల్లిలో మొక్కజొన్న పంట ఎండిపోతుండడంతో నిపుణులతో పరిశీలించాల్సిఉందని ఏవో బాబ్జీ తెలిపారు.

 గోకర్ణపల్లిలో మొక్కజొన్నకు తెగులు
ఎండిపోయిన మొక్కజొన్నపంట::

పొందూరు: మండలంలోని గోకర్ణపల్లిలో మొక్క జొన్న పంటకు తెగులు ఆశించడం తో 150 ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. ఇక్కడ సుమారు 60 మంది రైతులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుచేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటచేతికొచ్చిన సమయం లో తెగులుఆశించి ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవ సాయాధికారులు పంటను పరిశీలించి పరిహారం అందించాలని మాజీ సర్పంచ్‌ చింతాడ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కాగా గోకర్ణపల్లిలో మొక్కజొన్న పంట ఎండిపోతుండడంతో నిపుణులతో పరిశీలించాల్సిఉందని ఏవో బాబ్జీ తెలిపారు.

Updated Date - 2023-09-20T00:19:33+05:30 IST