విద్వేషాలను తిప్పికొట్టిన ప్రజలు

ABN , First Publish Date - 2023-03-19T23:59:04+05:30 IST

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని పేరుతో పన్నిన పన్నాగాన్ని రాష్ట్రప్ర జలు తిప్పికొట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు.

విద్వేషాలను తిప్పికొట్టిన ప్రజలు

పొందూరు: ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని పేరుతో పన్నిన పన్నాగాన్ని రాష్ట్రప్ర జలు తిప్పికొట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని తండ్యాం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ దురుద్దేశంతో పన్నిన కుట్రను పసిగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి విజ్ఞులైన విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ దుర్మార్గాలపై మూడు ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలిచ్చిన తీర్పే ఈ ఫలి తాలన్నారు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఫలితం టీడీపీ వైపే వచ్చిందని తెలిపారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు ప్రతిబింబిస్తాయని చెప్పారు. ఒక్క అవకాశం అన్న జగన్‌రెడ్డికి అవ కాశమిచ్చి రాష్ట్ర ప్రజలు చేసిన తప్పును తెలుసుకున్నారని తెలిపారు. అనుభ వం, నిజాయితీ గల చంద్రబాబుకు, టీడీపీకి పట్టం కట్టేందుకు రాష్ట్రప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపై ఎద్దేవా చేసేలా మాట్లాడుతున్న సజ్జల, వైసీపీ నాయకులు తప్పుడు, దొంగ ఓట్లు, దౌర్జన్యంతో ఎందుకు గెలవాలని చూశారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు ఓట్లు, రిగ్గింగు, డబ్బుతో గెలిచిన వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అందరికి తెలుసన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితా లతో తమకు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అనుకూలమని చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు జగన్మోహనరెడ్డి మరి నమ్మే అవకాశమే లేదని, ఉపాధ్యాయులకే కాదు, ప్రజలకు ఈ ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసున్నారు. పశ్చిమ రాయలసీమ ఫలితంతో కడపలోనే కాదు పులివెందులలో కూడా జగన్‌ పనైపోయిందని సూచిస్తోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవంలేదని, అం దుకే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీ స్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెం డ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఆయనతోపాటు టీడీపీ మండలాధ్యక్షుడు రామ్మోహన్‌, తండ్యాం సర్పంచ్‌ కె.భాస్కరరావు తదితరులు ఉన్నారు.

చంద్రబాబు వ్యూహం ముందు వైసీపీ చిత్తు

అరసవల్లి: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడి వ్యూహం ముందు వైసీపీ చిత్తయ్యిందని, టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘనవి జయం సాధించారని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్‌ జరిగే వరకూ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి వ్యూహాత్మక ఆదేశాలు జారీచేయడంతో అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిరంజీవిరావు గెలుపుతో మూడు రాజధానుల సెంటిమెంట్‌ అంతా ఒట్టి బూటకం అని నిరూపితమైందన్నారు. అదే విధంగా ఉత్తర రాయలసీమ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయం హైకోర్టు సెంటిమెంట్‌ను పటాపంచలు చేసిందన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగ యువత అంతా తమ వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో చూపించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని తెలిపారు.

Updated Date - 2023-03-19T23:59:04+05:30 IST