రాజ్యాంగ విలువల పరిరక్షణకు మహోద్యమం

ABN , First Publish Date - 2023-06-11T23:51:15+05:30 IST

రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు దేశంలో మహోద్యమం కొనసాగాలని భారత్‌ బచావో జాతీయ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.గోపీనాఽథ్‌ అన్నారు. ఆదివారం టెక్కలి లోని ఓ కల్యాణమండపంలో ‘భారత్‌ బచావో’ మహా సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో లౌకిక వాదాన్ని కాపాడుకు నేందుకు ప్రజలంతా నడుంకట్టాలని కోరారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణకు మహోద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న భారత్‌ బచావో రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్‌

టెక్కలి, జూన్‌ 11: రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు దేశంలో మహోద్యమం కొనసాగాలని భారత్‌ బచావో జాతీయ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.గోపీనాఽథ్‌ అన్నారు. ఆదివారం టెక్కలి లోని ఓ కల్యాణమండపంలో ‘భారత్‌ బచావో’ మహా సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో లౌకిక వాదాన్ని కాపాడుకు నేందుకు ప్రజలంతా నడుంకట్టాలని కోరారు. కార్పొరే ట్లకు దేశంలో బడా పరిశ్రమ లను అమ్మకానికి పెట్టి, మరోవైపు మూఢత్వాన్ని కేంద్ర బీజేపీ ప్రభు త్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ జాతీయ ఉద్యమం నుంచి దేశ సేవ చేస్తోందన్నారు. దేశ ప్రజల కోసం అంకితమైన పార్టీగా.. సంఘ్‌ పరివార్‌ ఫాసిస్టు విధానాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నెహ్రూ కాలం నుంచి కాం గ్రెస్‌ విధానాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు అనుకూ లంగా ఉన్నాయన్నారు. కుల, మత, ప్రాంతీయ ప్రసస్తి కాంగ్రెస్‌ పాలనలో ఏనాడూ లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు, జగన్‌, పవన్‌ కలిసి బీజేపీని ఈ రాష్ట్రంలో మోస్తున్నారని ఆరోపించారు. భారత్‌ బచావో రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్‌ మాట్లా డుతూ.. రాజ్యాంగ లక్ష్యాన్ని కాపాడు కునేందుకు ప్రజలంతా ఏకమై ఈ ఉద్యమంలో కలిసి రావాలన్నారు. తాము ఏ పార్టీకి అనుకూలం కాదని, కేవలం బీజేపీ విధానాలను మాత్రమే వ్యతిరే కిస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో మహాసభ జిల్లా కన్వీనర్‌ పేడాడ పరమేశ్వరరావు, రాష్ట్ర నాయకులు గూడూరు సీతామహాలక్ష్మి, రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ నాయకులు ఎ.షణ్ముఖరావు, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, ఎస్‌ఎన్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కేవీ జగన్నాఽథరావు, కార్యదర్శిగా ఎస్‌సీ జగన్నాథరావు తదితరులను ఎన్నుకున్నారు.

Updated Date - 2023-06-11T23:51:15+05:30 IST