పిడుగుపాటుకు 78 మూగజీవాలు మృతి

ABN , First Publish Date - 2023-03-20T00:06:55+05:30 IST

టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై 78 మేక, గొర్రె పిల్లలు మృతిచెందాయి.

పిడుగుపాటుకు 78 మూగజీవాలు మృతి
టెక్కలి మండలం దీపావళిపేట గ్రామంలో మృతిచెందిన మేకలు, గొర్రెలు

టెక్కలి రూరల్‌: టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై 78 మేక, గొర్రె పిల్లలు మృతిచెందాయి. పశుసంవర్థకశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు టెక్కలికి చెందిన డొక్కరి రాజు, లక్ష్మణరావు, ఆదినారాయణ, మల్లేషు, కృష్ణ, రామారావులకు చెందిన సుమారు 78 మేక, గొర్రె పిల్లలను మందగా.. దీపావళి గ్రామంలో మేత కోసం తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం ఈ గొర్రెల మందపై పిడుగు పడడంతో అన్నీ అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధితులు బోరున విలపించారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మృతిచెందిన వాటికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు టెక్కలి పశుసంవర్ధకశాఖ ఏడీ జీ.రఘునాధ్‌ తెలిపారు.

Updated Date - 2023-03-20T00:06:55+05:30 IST