జి.సిగడాంలో 43.1 డిగ్రీలు

ABN , First Publish Date - 2023-04-13T00:02:34+05:30 IST

భానుడు భగభగమన్నాడు. ఎండ తీవ్రతతో జిల్లాప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బుధవారం ఏకంగా 26 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో సెగలు పుట్టించాయి.

జి.సిగడాంలో 43.1 డిగ్రీలు
నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇలా..

- జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

- నేడు, రేపు కూడా వడగాల్పులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

భానుడు భగభగమన్నాడు. ఎండ తీవ్రతతో జిల్లాప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బుధవారం ఏకంగా 26 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో సెగలు పుట్టించాయి. ఇప్పటికే వడగాల్పులపై ముందస్తుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. బుధవారం జిల్లాలోని జి.సిగడాం మండలంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాతపట్నం, పోలాకి, ఎచ్చెర్ల, జలుమూరు మండలాల్లో 42 డిగ్రీలు దాటిపోయింది. దీనికితోడు వడగాల్పులతో జనం బెంబేలెత్తారు. శ్రీకాకుళంలో 39.7 ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ... కర్ఫ్యూ వాతావరణం మాదిరిగా మధ్యాహ్నం 12గంటల సమయానికే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. గురువారం, శుక్రవారం పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు, హిరమండలం, బూర్జ మండలాల్లో వడగాల్పులు ఉంటాయని.. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు :

--------------------

జి.సిగడాం 43.1

పాతపట్నం 42.7

పోలాకి 42.7

ఎచ్చెర్ల 42.4

జలుమూరు 42.0

గార 41.8

లావేరు 41.8

సంతబొమ్మాళి 41.8

ఇచ్ఛాపురం 41.7

ఎల్‌.ఎన్‌.పేట 41.6

కోటబొమ్మాళి 41.5

మెళియాపుట్టి 41.5

హిరమండలం 41.4

మందస 41.3

రణస్థలం 41.3

నరసన్నపేట 41.2

కంచిలి 41.1

కొత్తూరు 41.0

ఆమదాలవలస 40.9

వజ్రపుకొత్తూరు 40.9

నందిగాం 40.8

పలాస 40.8

పొందూరు 40.8

సారవకోట 40.8

బూర్జ 40.5

సరుబుజ్జిలి 40.3

శ్రీకాకుళం 39.7

కవిటి 39.1

సోంపేట 38.1

టెక్కలి 33.2

Updated Date - 2023-04-13T00:02:34+05:30 IST