‘జిల్లా పోలీసు స్పందన’కు 33 వినతులు

ABN , First Publish Date - 2023-06-26T23:29:52+05:30 IST

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జీఆర్‌ రాధిక ఆధ్వర్యంలో నిర్వహిం చిన స్పందన విభాగానికి 33 విన తులు అందాయి. అర్జీదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

‘జిల్లా పోలీసు స్పందన’కు 33 వినతులు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జీఆర్‌ రాధిక ఆధ్వర్యంలో నిర్వహిం చిన స్పందన విభాగానికి 33 విన తులు అందాయి. అర్జీదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని స్టేష న్ల ఎస్‌ఐలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వ హించి ‘స్పందన’కు అందే వినతులపై గడువులోగా చర్యలు తీసుకోవాలన్నారు. వినతుల్లో ఛీటింగ్‌పై మూడు, కుటుంబ వివాదాలపై మూడు, పాతఫిర్యాదులపై రెండు, ఆస్తి వివాదాలపై 10, ఇతరత్రా వివిదాలపై 15 వినతులు ఉన్నాయి. అలాగే కేంద్ర యువజన సర్వీసులు క్రీడల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘యువ ఉత్సవ్‌-2023’ పోస్టర్‌ను సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరిం చారు. ‘జిల్లా నెహ్రూ యువ కేంద్రం’ ఆధ్వర్యంలో ఈనెల 28న ‘పంచ ప్రాణ్‌ ఆఫ్‌ అమృత్‌ కాల్‌’ అంశంపై సెమినార్‌ శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అలాగే ‘గోల్‌ ఆఫ్‌ డెవలప్‌డ్‌ ఇండియా’ అంశం పై ఉపన్యాసం చేసే విద్యార్థులకు నగదు పురస్కారాలను అందిస్తామన్నారు. ఇదే అంశంపై చిత్రలేఖనం, వ్యాస రచన, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఇందులో గెలుపొందినవారు రాష్ట్ర, జాయతీ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2023-06-26T23:29:52+05:30 IST