1,150 మద్యం సీసాల కల్తీ
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:40 PM
స్థానిక మెయిన్ రోడ్డులో గల ప్రభు త్వ మద్యం దుకా ణంలో గురువారం సాయంత్రం శ్రీకా కుళానికి చెందిన విజిలెన్స్ అధికారు లు దాడులు నిర్వహించారు.
కోటబొమ్మాళి: స్థానిక మెయిన్ రోడ్డులో గల ప్రభు త్వ మద్యం దుకా ణంలో గురువారం సాయంత్రం శ్రీకా కుళానికి చెందిన విజిలెన్స్ అధికారు లు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1150 మద్యం సీసాల్లో కల్తీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులు హఠకేశ్వరరావు, బాలరాజు, పెటయ్యలపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ కె.రాజేష్‌కుమార్ తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మద్యం సీసాలను పరీక్షించగా వివిధ బ్రాండ్లకు సంబంధించి 24 కేసుల్లో గల 1150 సీసాల్లో కల్తీ జరిగినట్టు గుర్తించా మని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్‌ఐ బి.శ్రీరామమూర్తి, సిబ్బంది జగన్నాథం, నాగు, సత్యనారాయణ, వీఆర్వో అఖిల్ పాల్గొన్నారు.