గణనాథునికి 108 రకాల ప్రసాదాలు
ABN , First Publish Date - 2023-09-22T23:33:11+05:30 IST
బోరుభద్ర వైశ్య సంఘంలో ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 108 రకాల ప్రసా దాలను శుక్రవారం నైవేద్యంగా సమర్పించారు.
సంతబొమ్మాళి: బోరుభద్ర వైశ్య సంఘంలో ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 108 రకాల ప్రసా దాలను శుక్రవారం నైవేద్యంగా సమర్పించారు. గ్రామ వీధుల్లో మేళాతాలతో మహిళలు 108 రకాల ప్రసా దాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి వినాయకునికి సమర్పిం చి ప్రత్యేక పూజలు చేశారు.
హిరమండలం: హిరమండలంలో వినాయక ఉత్సవాల సందర్భంగా శుక్ర వారం సాయంత్రం గిరిజాల వీధి, అందవరపు వీధుల్లో మండపాల వద్ద 108 మంత్రాలు చదు వుతూ 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.
వినాయక లడ్డూ ధర రూ.85 వేలు
జలుమూరు: అబ్బాయిపేటలో ఏర్పాటు చేసి గణనాథుని లడ్డూ ప్రసాదం రూ.85 వేలు పలికింది. శుక్రవారం స్వామి నిమజ్జనం సందర్భంగా లడ్డూను వేలం వేశారు. శ్రీకాకుళానికి చెందిన టి.వెంకటబాబు వేలంపాటను దక్కించుకున్నారు. రాత్రి గణేశుని విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి గ్రామస్థులంతా మంగళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగించి సమీపూంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.