Somireddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-08T19:34:51+05:30 IST

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై (YCP MLA Prasannakumar Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) విమర్శలు గుప్పించారు.

Somireddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నెల్లూరు: కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై (YCP MLA Prasannakumar Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) విమర్శలు గుప్పించారు. ''ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఏ రోటికాడ ఆ పాట పాడటం ప్రసన్నకుమార్ రెడ్డికి బాగా అలవాటే. ఎన్నికలు వచ్చే సమయానికి సర్వేలు చేయించుకొని పార్టీలు మారడం, గెలిచాక లెక్కలేసుకొని ప్రజల్ని దోచుకోవడంలో ప్రసన్నకుమార్ రెడ్డే ఘనుడు.'' అని సోమిరెడ్డి ఆరోపించారు.


''నా ఓటమి, లోకేశ్ ఓటమిపై మాట్లాడుతున్న ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుస్తానని ధైర్యంగా చెప్పగలడా?. ప్రణబ్ ముఖర్జీ, పీవీ నరసింహారావు, వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు గెలిచారు. రాజకీయమంటే గెలుపోటములు కాదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి, వారికోసం పనిచేయడమని తెలుసుకో. జనంకోసం జనం మధ్యన బతికేవారికి ఎప్పుడూ ఓటమి ఉండదు. ప్రసన్నకుమార్ రెడ్డి బాగోతమంతా పీకే బృందం జగన్ ముందు పెట్టడంతో ఆయనకి నిద్రపట్టడం లేదు.'' అని సోమిరెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-07-08T19:44:56+05:30 IST