దెబ్బతిన్న రైలు పట్టా.. ముందే గుర్తించడంతో తప్పిన ఘోర రైలు ప్రమాదం..
ABN , First Publish Date - 2023-11-27T13:07:04+05:30 IST
తిరుపతి - కాట్పాడి రైలు మార్గం, పూతలపట్టు సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పిపోయింది. పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది గుర్తించింది.అదే సమయంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్.. రామేశ్వరం నుంచి తిరుపతి కి వెళుతోంది.
చిత్తూరు : తిరుపతి - కాట్పాడి రైలు మార్గం, పూతలపట్టు సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పిపోయింది. పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది గుర్తించింది.అదే సమయంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్.. రామేశ్వరం నుంచి తిరుపతి కి వెళుతోంది. హటాహుటిన రైల్వే ట్రాక్‌కి సిబ్బంది వెల్డింగ్ చేసింది. ట్రాక్ సిద్ధమవడంతో తిరుపతికి రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ తిరుగు పయనమైంది. సకాలంలో ఘటనను గుర్తించడంతో తప్పిన పెను ప్రమాదంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.