బాబాయ్ హత్య, కోడి కత్తి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచాం : Raghurama

ABN , First Publish Date - 2023-04-19T14:13:36+05:30 IST

ఏపీ సీఎస్ జోవహర్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సి ఉంటుందని అన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.

బాబాయ్ హత్య, కోడి కత్తి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచాం : Raghurama

ఢిల్లీ : ఏపీ సీఎస్ జోవహర్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సి ఉంటుందని అన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాష్టానికి సంబంధించిన అంశాల పై కేంద్ర అధికారులతో చర్చలు జరపడానికి వెళ్తున్నామని.. వీలైతే ముఖ్యమంత్రి రావాల్సి ఉంటుందని సీఎస్ జోహార్ రెడ్డి చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం కోసం కన్నబిడ్డల దగ్గరికి వెళ్లకుండా రాష్ట్రం కోసం ప్రయాణం ఆపుకున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. జగనే వందమంది సలహాదారులను పెట్టుకున్నారని.. ఆయనేం సలహాలు ఇస్తారని ప్రశ్నించారు. ‘‘ఇంకా ఎన్ని రోజులు పోలవరం, ప్రత్యేక హోదా అంటారు? జనం హస్యించుకుంటున్నారు. బాబాయ్ హత్య, కోడి కత్తి అంటూ అబద్ధాలు చెప్పి జగన్, మేము ఎన్నికల్లో గెలిచాం. డబ్బులు లేవు అందుకే జగన్ మొన్న బటన్ నొక్క లేదని సీఎస్ జోహార్ రెడ్డి అన్నారు’’ అని రఘురామ తెలిపారు.

Updated Date - 2023-04-19T14:13:36+05:30 IST