AP News : బస్సులో తీర్థయాత్రలకు వెళుతుండగా ఘోర ప్రమాదం.. 40 మంది ప్రయాణికులు..

ABN , First Publish Date - 2023-09-22T08:58:13+05:30 IST

అన్నమయ్య జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం దేవపట్ల దగ్గర లారీ.. టూరిజం ప్రైవేటు బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

AP News : బస్సులో తీర్థయాత్రలకు వెళుతుండగా ఘోర ప్రమాదం.. 40 మంది ప్రయాణికులు..

అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం దేవపట్ల దగ్గర లారీ.. టూరిజం ప్రైవేటు బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరూ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులలో10మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి, కడప, ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు తీర్ధయాత్రలకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2023-09-22T08:58:13+05:30 IST