Share News

Prathipati Pullarao: నమ్మకద్రోహానికి ప్రతిరూపం జగన్ రెడ్డి

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:55 PM

నమ్మకద్రోహానికి ప్రతిరూపం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వాడుకుని వదిలేయడం జగన్ నైజమన్నారు. 57 నెలల పాలనలో అన్ని వర్గాలనూ జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. చిన్నాన్నను చంపినవాళ్లను.. కాపాడుతున్న జగన్‌ను ఏం అనాలని ప్రశ్నించారు.

Prathipati Pullarao: నమ్మకద్రోహానికి ప్రతిరూపం జగన్ రెడ్డి

పల్నాడు జిల్లా: నమ్మకద్రోహానికి ప్రతిరూపం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వాడుకుని వదిలేయడం జగన్ నైజమన్నారు. 57 నెలల పాలనలో అన్ని వర్గాలనూ జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. చిన్నాన్నను చంపినవాళ్లను.. కాపాడుతున్న జగన్‌ను ఏం అనాలని ప్రశ్నించారు. జగన్‌ను నమ్మిన ఉద్యోగులు, కార్మికుల అందరికీ మిగిలింది నయవంచనేనని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చివరకు తనవెంట నడిచిన ఎమ్మెల్యేలను కూడా మోసం చేసిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు. అమరావతి రైతుల్ని నమ్మించి జగన్ రోడ్డు పాలు చేశాడన్నారు. పేద ప్రజలు, నిరుద్యోగుల్ని మోసం చేసి, ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారన్నారు. దళితులు, బీసీలను నమ్మించి గొంతుకోసి వాళ్లకు అన్యాయం చేశారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Updated Date - Dec 26 , 2023 | 01:55 PM