Share News

వైసీపీ అరాచక పాలనపై సమరం

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:30 PM

ఒక్క అడుగుతో మొదటైన యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిందని, ముగింపు సభ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన ఓప్రకటన విడుల చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఈనెల 20న జరిగే ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.

వైసీపీ అరాచక పాలనపై సమరం
యువనేత నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఏలూరితోపాటు దివ్వేష్‌

యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఏలూరి

పర్చూరు, డిసెంబరు 18: ఒక్క అడుగుతో మొదటైన యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిందని, ముగింపు సభ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన ఓప్రకటన విడుల చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఈనెల 20న జరిగే ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, యువతను చైతన్యం చేసేందుకు యువగళం పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. ఈ పాదయాత్రలో యువనేత కోట్లాది మంది ప్రజల మనస్సును గెలుచుకున్నారన్నారు. యువగళం ముగింపు సభ చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరి పేర్కొన్నారు. 20న జరిగే ముగింపు సభకు కదలిరావాలని పిలుపు నిచ్చారు. గాజువాకలో జరిగిన యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే ఏలూరి తనయుడు ఏలూరి దివ్వేష్‌ పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్‌తో కలసి అడుగులు వేశారు.

Updated Date - Dec 18 , 2023 | 10:30 PM