జగనాసురుడిని వైసీపీ కార్యకర్తలే నమ్మడం లేదు
ABN , First Publish Date - 2023-05-02T00:44:20+05:30 IST
రాష్ట్రంలో జగనాసుర పాలన రాక్షస పాలనగా మారిందని, ఆయనను వైసీపీ కార్యకర్తలే నమ్మడం లేదని తెలుగు తమ్ముళ్లు విమరించారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జగన్ పాలనపై నిరసన చేపట్టారు.జగన్ అవినీతి, నేర చరిత్రలోని ఒక్కో అంశాన్ని చూపుతూ, జగన్ పది తలల బొమ్మతో నిరసనచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు జగన్‌ను నమ్మడం లేదన్నారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.
ఒంగోలు (కార్పొరేషన్), మే 1 : రాష్ట్రంలో జగనాసుర పాలన రాక్షస పాలనగా మారిందని, ఆయనను వైసీపీ కార్యకర్తలే నమ్మడం లేదని తెలుగు తమ్ముళ్లు విమరించారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జగన్ పాలనపై నిరసన చేపట్టారు.జగన్ అవినీతి, నేర చరిత్రలోని ఒక్కో అంశాన్ని చూపుతూ, జగన్ పది తలల బొమ్మతో నిరసనచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు జగన్‌ను నమ్మడం లేదన్నారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని జగన్ అవినీతిని ప్రశ్నించేందుకు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరఽథం పడుతున్నారని అన్నారు. రాబోవు ఎన్నికల్లో జగన్‌ను ఓడించి, టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కొఠారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, నావూరి కుమార్, ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, పెద్దిశెట్టి వరలక్ష్మి, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.