వైసీపీని సాగనంపాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:51 PM
రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపుని చ్చారు. చినగంజాం మండలం సంతరావూరు, మార్టూరు మండలం అనంతవరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున మంగళవారం ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు
టీడీపీలో పలువురు చేరిక
పర్చూరు, డిసెంబరు 26: రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపుని చ్చారు. చినగంజాం మండలం సంతరావూరు, మార్టూరు మండలం అనంతవరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున మంగళవారం ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. ఎస్పీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు ఏలూరి స మక్షంలో పార్టీలో చేరారు. అదేవిధంగా చినగంజాం మండలం సంత రావూరు బీసీ కాలనీ వడ్డెర రాజులకు చెందిన 20 కుటుంబాలు తన్నీ రు కృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
ఈసందర్భంగా ఏలూరి మాట్లాడుతూ అధికార వైసీపీ నిరంకుశ, విధ్వంస పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కలసి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. పార్టీలో చేరి న వారిలో సవరపు రాజేష్, జంగా రాజేష్, మద్దిరాల రాజా, దేవర పల్లి జీవా, కూరాకుల రమేష్, తిరుపతి రాంబాబు, దేవరపల్లి దాన య్య, కోటి రాజారావు, తదితరులు ఉన్నారు.