Share News

వైసీపీ మునిగిపోయే నావ

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:25 AM

రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ అని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

వైసీపీ మునిగిపోయే నావ

గిద్దలూరు, డిసెంబరు 28 : రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ అని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఓబులాపురం గ్రామం లో గురువారం రాత్రి ఆయన ఇంటింటికి తిరిగి మిని మానిఫెస్టో ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఎస్సీలకు చేసిందేమి లేదన్నారు. దళితద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 27 సంక్షే మ పథకాలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల మద్దతుతో టీడీపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధు సూదన్‌, టీడీపీ నాయకులు ప్రభా కర్‌, శ్రావణ్‌కుమార్‌, అంకయ్య, రాజశేఖర్‌, బాలయ్య, వెంకటరమణ, బాలీశ్వరయ్య, శేషగిరి, ప్రసాద్‌, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

యువగళం విజయవంతం

ఎర్రగొండపాలెం : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో వైసీపీలో ఆందోళన మొదలైందని టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకర్లతోమాట్లాడారు. ఈ సభ ఈ నెల 20న ముగిసిందన్నారు. సభలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌లు ఒకే వేదికపైకి వచ్చారు. వీరిని చూసిన వైసీపీ నాయకత్వంలో వణుకు మొదలైందన్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో 5 కోట్ల మంది ఆంధ్రులకు మేలు చేకూరుతుందన్నారు. రెండు పార్టీల పొత్తు చరిత్మాకం అన్నారు. యువగళం ముగింపు సభలో ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం కోసం టీడీపీ, జనసేన పొత్తులో 160 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవడం తథ్యమన్నారు. 2024లో ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటర్లు తమ బాధ్యతగా టీడీపీకి ఓటు వేయాలన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 01:25 AM