నగరంలో ఇష్టారాజ్యంగా వైసీపీ ఫ్లెక్సీలు
ABN , First Publish Date - 2023-11-22T00:10:37+05:30 IST
నగరం లో ఫ్లెక్సీల ఏర్పాటుపై వైసీపీకో న్యాయం, టీడీపీకో న్యాయమా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్ర జాసమస్యలపై ఒక్కరోజు కూడా మీడియా సమావే శంలో మాట్లాడటం ఇంతవరకు ఎవరూ చూడలే దని ఆరోపించారు.

అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలినేనివి ప్రగల్భాలంటూ ధ్వజం
ఒంగోలు(కార్పొరేషన్), నవంబరు 21: నగరం లో ఫ్లెక్సీల ఏర్పాటుపై వైసీపీకో న్యాయం, టీడీపీకో న్యాయమా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్ర జాసమస్యలపై ఒక్కరోజు కూడా మీడియా సమావే శంలో మాట్లాడటం ఇంతవరకు ఎవరూ చూడలే దని ఆరోపించారు. మంగళవారం ఒంగోలులోని టీ డీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలినే ని సోమవారం మీడియా సమావేశంలో తమ నా యకుడు దామచర్ల జనార్దన్‌ను విమర్శించారని, ఇది మంచిది కాదన్నారు. తమ నాయకుడు దామ చర్ల జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఓర్చుకోలేని బాలినేని వెంటనే తొలగించారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు చేపట్టిన ఫ్రెండ్స్ క్రికెట్ కోసం ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను తొలగించిన ఆయన మానసిక వ్యధలో ఉన్నారని ఎద్దేవా చేశా రు. ఇపుడు వైసీపీ కార్యక్రమానికి నగరమంతా ఇ ష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, దీనిపై ఏ మి సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. వాటిని అనుమతులు ఉన్నాయో లేవో చెప్పాలని డి మాండ్ చేశారు. అలాగే నగరంలో ఇందిరమ్మకాలనీ లో కనీసం రహదారులు లేవని, ఊరచెరువులో పా రిశుధ్యం అధ్వానంగా ఉందని, శివారు కాలనీల్లో కనీస అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే బాలినేని, ఇద్దరి అంతు తేలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ నాయకుడు జనార్దన్‌ను విమ ర్శించే ముందు నగర ప్రగతిపై ప్రజలకు ఏమి సమాధానం ఇవ్వాలో ముందు తెలుసుకోవాలని హి తవు పలికారు. ఎమ్మెల్యే పక్కనే ఉండే చిల్లర నా యకులు ఒకరిద్దరు మాటలు విని కనీస అవగా హన లేకుండా మాట్లాడుతున్నావని ధ్వజమెత్తారు. ఒక్కసారి కూడా నగర అభివృద్ధి, ప్రజల సమస్య లపై మీడియా సమావేశం పెట్టావా అని ప్రశ్నిం చారు. మీడియా సమావేశాల్లో బాలినేని భజన బృందం టీడీపీపై అనవసరమైన ఆరోపణలు మా నుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో నాయ కులు ఎద్దు శశికాంత్‌భూషణ్, ముత్తన శ్రీనివాసరా వు, బండారు మదన్, నావూరి కుమార్, రమేష్ తది తరులు పాల్గొన్నారు.